ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మహా కావ్యం రామాయణం(Ramayanam). శ్రీరామకథ వెండితెరపై అనేకసార్లు ఆవిష్కృతమయ్యింది. ప్రజల మెప్పును పొందింది. ఆదిపురుష్(Adipurush) వంటి సినిమాలు మినహా రాముడి కథను చెప్పిన ప్రతీ సినిమా జనరంజకమయ్యింది. రామాయణం కావ్యం కాలాతీతం. అందుకే ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. మరోసారి రామాయణ ఇతివృత్తాన్ని చెప్పడానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. రామయణ(Ramayan) పేరుతో సినిమాను రూపొందిస్తోంది

Trivikram
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మహా కావ్యం రామాయణం(Ramayanam). శ్రీరామకథ వెండితెరపై అనేకసార్లు ఆవిష్కృతమయ్యింది. ప్రజల మెప్పును పొందింది. ఆదిపురుష్(Adipurush) వంటి సినిమాలు మినహా రాముడి కథను చెప్పిన ప్రతీ సినిమా జనరంజకమయ్యింది. రామాయణం కావ్యం కాలాతీతం. అందుకే ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. మరోసారి రామాయణ ఇతివృత్తాన్ని చెప్పడానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. రామయణ(Ramayan) పేరుతో సినిమాను రూపొందిస్తోంది. నితేశ్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణబీర్‌కపూర్(Ranbir kapoor) రాముడిగా నటిస్తున్నారు. సాయిపల్లవి(Sai pallavi) సీతమ్మ పాత్రను పోషిస్తున్నారు. ఇక రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్(Yash) నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర యూనిట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు(Trivikram) అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో దర్శక నిర్మాతలు ఆయనను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.
