అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప- 2 సినిమా విడుదల వాయిదా పడింది. గత కొద్దిరోజులుగా పుష్ప-2 సినిమా విడుదల అనుకున్న సమయానికి జరగడం లేదనే ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే వేరే సినిమాలు పుష్ప-2 రిలీజ్ డేట్ న రాబోతూ ఉండడంతో ఇక వాయిదా పడినట్లుగా అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా, మేకర్స్ సినిమా రిలీజ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. రామ్ పోతినేని పుష్ప-2 రిలీజ్ తేదీని వాడుకోవాలని అనుకుంటూ ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ‘ఐకాన్ స్టార్’ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఇందులో రష్మిక హీరోయిన్ గా.. ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రను చేస్తున్నారు.


Updated On
Eha Tv

Eha Tv

Next Story