బిగ్ బాస్(Big Boss) షో లో అవకాశం ఇప్పిస్తానని పలువురిని కేటుగాళ్లు మోసం చేశారు. ఈ మేరకు జూనియర్ ఆర్టిస్ట్‌లు(Junior Artists), యాంకర్లకు(Anchors) ఆశ చూపి లక్షల రూపాయలు వసూలు చేసిన తమ్మలి రాజు(Tammali Raju), సత్య(Satya) అనే ఇద్దరు వ్యక్తులు. బిగ్ బాస్ సీజన్-7 లో అవకాశం ఇప్పిస్తానని యాంకర్ స్వప్న చౌదరి(Swapna Chowdary) నుంచి తమ్మలి రాజు 2.5 లక్షలు వసూలు చేశాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును స్వప్న చౌదరి నిలదీసింది.

big boss
బిగ్ బాస్(Big Boss) షో లో అవకాశం ఇప్పిస్తానని పలువురిని కేటుగాళ్లు మోసం చేశారు. ఈ మేరకు జూనియర్ ఆర్టిస్ట్‌లు(Junior Artists), యాంకర్లకు(Anchors) ఆశ చూపి లక్షల రూపాయలు వసూలు చేసిన తమ్మలి రాజు(Tammali Raju), సత్య(Satya) అనే ఇద్దరు వ్యక్తులు. బిగ్ బాస్ సీజన్-7 లో అవకాశం ఇప్పిస్తానని యాంకర్ స్వప్న చౌదరి(Swapna Chowdary) నుంచి తమ్మలి రాజు 2.5 లక్షలు వసూలు చేశాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును స్వప్న చౌదరి నిలదీసింది. సీజన్-7 ఉల్టా పుల్టా కావడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ(Wild card entry) ఉంటుందని ఆమెను రాజు మరోసారి నమ్మించాడు. సీజన్ ముగిసేంత వరకు ఎదురుచూసిన యాంకర్ స్వప్న చౌదరి గట్టిగా నిలదీయడంతో ఎదురుతిరిగాడు. ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో మా టీవీలో పనిచేసిన రాజు. ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు మాటీవీ(Maa Tv) యాజమాన్యానికి తెలియడంతో అక్కడ రాజును ఉద్యోగం నుంచి తీసేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌లాంటి షోలలో అవకాశాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రాజు, సత్య డబ్బులు దండుకుంటున్నారు. డబ్బు తీసుకొని తనను మోసం(Cheat) చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు స్వప్న చౌదరి ఫిర్యాదు చేయగా సత్య, రాజుపై కేసు నమోదు చేశారు. నిందితులు రాజు, సత్య పరారీలో ఉన్నారు.
