✕
Guess the heroine : ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి.. కోట్లు తీసుకునే స్టార్ హీరోయిన్ అని తెలుసా.?
By EhatvPublished on 14 March 2023 5:22 AM GMT
టబు ఈ భామ పేరు వినగానే మనకు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ మూవీలో నాగార్జున సరసన అంతబాగా సెట్ అయింది మరి. ఈ చిత్రం తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత చెన్న ‘కేశవరెడ్డి’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ వంటి చిత్రాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది ఈ భామ.

x
Tabu
-
- టబు ఈ భామ పేరు వినగానే మనకు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ మూవీలో నాగార్జున సరసన అంతబాగా సెట్ అయింది మరి. ఈ చిత్రం తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత చెన్న ‘కేశవరెడ్డి’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ వంటి చిత్రాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది ఈ భామ.
-
- అయితే ఈ భామ అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. ఈమె 1971 నవంబర్ 4న హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఈ మె చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది.
-
- హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్థిరపడటంతో అక్కడ నటి ఫరాహ్ చెల్లెల్లు, నటి దివ్యభారతి ఫ్రెండ్స్ అయ్యారు ఆమెకు. దివ్యభారతి ద్వారా రాఘవేంద్రరావు ‘కూలీ నెం.1’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అంతకంటే ముందు 1980లోనే ‘బజార్’ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర చేసింది టబు. ఆ తర్వాత ‘హమ్ నే జవాన్’ అనే చిత్రంలో దేవానంద్‌కి కూతురిగా నటించి ఈ భామ.
-
- పద్నాలుగేళ్ల వయస్సులో చేసిన ఆ పాత్రతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాన్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత బోనీకపూర్ నిర్మాణంలో జరుగుతున్న సినిమాలు ‘రూప్ కీ రాణీ చోరోంకా రాజా’‘ప్రేమ్’ చిత్రాల్లో హీరోయిన్గా టబుని హీరోయిన్ గా తీసుకున్నారు. సంజయ్ కపూర్ సరసన నటించిన ఆమె.. మూవీ కంప్లీట్ అవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఆ తర్వాత రిలీజైన మూవీ డిజాస్టర్ అయింది.
-
- ఇటు తెలుగు పరిశ్రమలో ‘కూలీ నెం.1’తో హీరోయిన్ అయిన ఈమె టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. అటు తమిళ, హిందీ సినిమాలు చేస్తూనే తెలుగులోనూ చేస్తూ వచ్చింది టబు. ‘బార్డర్’, ‘విరాసత్’, ‘బివీ నెంబర్1’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ ‘హేరా ఫేరీ’, ‘అస్తిత్వ’, ‘చాందినీ బార్’, ‘మక్బూల్’, ‘చీనీ కమ్’ వంటి సినిమాలతో ఆమె సినీ ప్రయాణం బిజిబిజీగా సాగింది.
-
- మీరానాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంగ్లిషు మూవీ ‘ది నేమ్ సేక్’లో టబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. 2012లో విడుదలైన ‘లైఫ్ ఆఫ్ పై’ లోనూ ఓ మంచి క్యారెరక్టర్ చేసి అభిమానులను అలరించింది. ఇటు ‘చీనీ కమ్’ మూవీ కూడా ఇంటర్నేషనల్ గా మంచి ఆరధరణ పొందింది.
-
- ఇక టబు వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు, అదలా ఉంటే ఆమె ప్రేమలో పడిందని రూమర్స్ కూడా ఒచ్చాయి. హీరో నాగార్జునతో ఫ్రెండ్లీగా ఉంటుందని, బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాద్ వాలాతో రిలేషన్లో ఉందని వినికిడి.

Ehatv
Next Story