ప్రముఖ నటి గౌతమి కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు సియాకు 16వ పుట్టిన రోజు సందర్భంగా సెక్స్ టాయ్(Sex Toy ) లేదా వైబ్రేటర్‌ను బహుమతిగా ఇవ్వాలని భావించినట్లు వెల్లడించారు.

ప్రముఖ నటి గౌతమి కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు సియాకు 16వ పుట్టిన రోజు సందర్భంగా సెక్స్ టాయ్(Sex Toy ) లేదా వైబ్రేటర్‌ను బహుమతిగా ఇవ్వాలని భావించినట్లు వెల్లడించారు.. ఆమె మాటల్లో, “నీవు ఎందుకు ప్రయత్నించకూడదు, ఎందుకు ప్రయోగాలు చేయకూడదు?” అని సియాతో చెప్పానని, సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఆలోచన వచ్చిందని తెలిపింది. అయితే, సియా (Sia)దీనికి స్పందిస్తూ, “అమ్మా, నీవు పిచ్చిదానివా?” అని అడిగిందని గౌతమి తెలిపింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. ఆమె తన కూతురితో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం, ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహించడం గురించి చర్చిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాయి. కొందరు గౌతమి ఓపెన్‌నెస్‌ను అభినందిస్తే, మరికొందరు 16 ఏళ్ల టీనేజర్‌కు సెక్స్ టాయ్ ఇవ్వాలనే ఆలోచనను తప్పుబట్టారు, ఇది వయస్సుకు తగినది కాదని విమర్శించారు. గౌతమి కపూర్ (Gautami Kapoor)హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో ప్రసిద్ధి చెందిన నటి, “క్యూ కి సాస్ భీ కభీ బహు థీ” వంటి షోల ద్వారా గుర్తింపు పొందింది. ఆమె నటుడు రామ్ కపూర్‌ను వివాహం చేసుకుంది, వీరికి సియా, అక్స్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఆలోచన తన కూతురితో సరదాగా జరిగిన సంభాషణలో భాగమని, ఆమె ఉద్దేశం సెక్స్ ఎడ్యుకేషన్‌ను సానుకూలంగా ప్రోత్సహించడమేనని తెలిపింది.
