✕
Guess the Actress : ఈ పాప 40 సినిమాల్లో స్టార్ హీరోయిన్ అని తెలుసా.. !
By EhatvPublished on 16 March 2023 6:37 AM GMT
ఈ ఫొటోలో స్కూల్ యూనిఫార్మ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా మీకు.. ఈ అమ్మాయి మన టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్. అగ్రహీరోల నుంచి స్టార్ట్ చేస్తే చిన్న హీరోల వరకు అందరి సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. అచ్చం పాలబొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదివేయండి మరి.. ఇంకెందుకు ఆలస్యం.. !

x
Thamanna
-
- ఈ ఫొటోలో స్కూల్ యూనిఫార్మ్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా మీకు.. ఈ అమ్మాయి మన టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్. అగ్రహీరోల నుంచి స్టార్ట్ చేస్తే చిన్న హీరోల వరకు అందరి సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. అచ్చం పాలబొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదివేయండి మరి.. ఇంకెందుకు ఆలస్యం.. !
-
- తమన్నా భాటియా ఈమె గురించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. తమన్నా పేరు చెప్పగానే వరుసబెట్టి ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’, తడాఖా, బద్రీనాథ్ ఇలా సినిమా పేర్లు చెప్పేస్తాం. అంత నోటెడ్ మరి ఈ మిల్క్ బ్యూటీ అంటే.
-
- ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలోని ముంబైలో 1989 డిసెంబర్ 21 జన్మించింది. సంతోష్, రజనీ భాటియాలకు పుట్టిన అమ్మాయే తమన్నా భాటియా. ఈ ముద్దుగుమ్మకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. తమన్నాకు చిన్నపటి నుంచే హీరోయిన్ అవ్వాలని ఉండేది.. దాంతో మోడలింగ్, డాన్సింగ్పై దృష్టి పెట్టింది.
-
- అయితే తమన్నా 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసింది. యాక్టింగ్‌పై ఆమెకున్న ఇంట్రెస్ట్‌ను చూసిన తల్లిదండ్రులు.. ఆమెకు పదేళ్ల వయస్సులోనే థియేటర్ ఆర్ట్స్‌లో చేర్పించారు. డాన్సంటే చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండటంతో ఈ ట్రైనింగ్ కూడా తీసుకుంది తమన్నా.
-
- ఇక తమన్నా 2005లో వచ్చిన ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో సమీర్ అఫ్తాబ్ సరసన నటించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో అదే ఇయర్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘శ్రీ’ సినిమాలో మంచు మనోజ్ జోడీ కట్టగా ఆ మూవీలో తమన్నా నటనకు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఒచ్చింది.
-
- ‘శ్రీ’ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టినా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత 2006లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘కేడీ’ సినిమాలో రవికృష్ణ సరసన నటించింది. ఆ తర్వాత 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ చిత్రంలో మధు అనే క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు దగ్గరైంది ఈ బ్యూటీ. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తమన్నాకు మంచి గుర్తింపు ఒచ్చింది.
-
- ఇక ఇటు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తు బిజిగా మారిన తమన్నా.. 2011లో ఆమె నటించిన 6 సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో 5 సినిమాల్లో హీరోయిన్గా చేయగా.. ఒక్క మూవీలో మాత్రం సాంగ్‌లో మెరిసింది. సౌత్ ఇండియన్ ఫిలింఫేర్ లో ఉత్తమ తెలుగు నటి అవార్డుకు తమన్నా నామినేట్ అయింది.
-
- తమన్నా యాక్టింగ్ పెద్దగా స్కోప్ లేకపోయినా తన గ్లామర్ కు మాత్రం ఫుల్ బజ్ ఒచ్చేస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఇక తమన్నా భాటియాకు ఇన్‌స్టా గ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story