ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) బర్త్‌డే! నందమూరి తారక రామారావు(Nandhamuri Tharaka Rama Rao) మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జూనియర్ చిరకాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. తాత సీనియర్ ఎన్టీఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర(BrahmarshiVishwamitra) సినిమాతో ఇండస్ట్రీలో కాలుమోపిన ఎన్టీఆర్ ఆ తర్వాత 13 ఏళ్లకు బాలరామాయణంలో(Balaramayanam) బాల రాముడిగా నటించి అందరినీ మెప్పించాడు.

HBD NTR
ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) బర్త్‌డే! నందమూరి తారక రామారావు(Nandhamuri Tharaka Rama Rao) మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జూనియర్ చిరకాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. తాత సీనియర్ ఎన్టీఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర(BrahmarshiVishwamitra) సినిమాతో ఇండస్ట్రీలో కాలుమోపిన ఎన్టీఆర్ ఆ తర్వాత 13 ఏళ్లకు బాలరామాయణంలో(Balaramayanam) బాల రాముడిగా నటించి అందరినీ మెప్పించాడు. తొలిసారిగా నంది అవార్డును(Nandhi Award) అందుకున్నాడు.
2001లో నిన్ను చూడాలని(Ninu chudalani) సినిమాతో హీరో అయ్యాడు. హీరోగా నటించిన మొదటి సినిమా గొప్పగా ఆడకపోయినా ఎన్టీఆర్ బాగా చేశాడన్న టాక్ మాత్రం వినిపించింది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్(Student No.1) సినిమాతో అందరి చూపు ఎన్టీఆర్‌పై పడింది. ఆది(Adhi), సింహాద్రి(simhadri), రాఖీ(Rakhi), యమదొంగ(Yamadonga), అదుర్స్(Adhurs), బృందావనం(Brindavanam) .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఉత్థాన పతనాలు కూడా ఉన్నాయి. ఒక దశలో వరుస ఫ్లాపులు ఎన్టీఆర్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. యమదొంగతో హిట్ కొట్టి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందాడు. నటనలోనే కాదు, డైలాగ్ డెలివరీలో, డాన్స్‌లో ఎన్టీఆర్ మేటి అనిపించుకున్నాడు.
ఎమోషన్స్‌ను పలికించడంలో ఎన్టీఆర్‌కు మించినవాడు ఈ తరంలో లేడంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కోసినిమాకు ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్‌లో ఆయనకు వంద కోట్లు ఇస్తున్నారని టాక్. ఎన్టీఆర్ అందుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిన్ను చూడాలని సినిమాకు ఆయనకు ఇచ్చింది మూడున్నర లక్షల రూపాయలే! అంత డబ్బును ఎన్టీఆర్ మొదటిసారి చూడటం. చాలా రోజుల వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ ఉన్నాడట. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నాడు. నటుడిగా, డాన్సర్‌గా, పాటగాడిగా, యాంకర్‌గా ఇలా అన్నింటిలోనూ మేటి అనిపించుకుంటున్న ఎన్టీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే అందిస్తోంది ఈహా!
