ఫేమస్‌ తారలకు బాడీగార్డులుంటారు. వీరు సదరు నటీనటులపై ఈగ కూడా వాలనివ్వరు.

ఫేమస్‌ తారలకు బాడీగార్డులుంటారు. వీరు సదరు నటీనటులపై ఈగ కూడా వాలనివ్వరు.బాడీగార్డు(Bodygard)లు అనడం కంటే బౌన్సర్లు అనడం కరెక్టు. వీరు సదరు నటీనటులపై ఈగ కూడా వాలనివ్వరు. కొన్నిసార్లు అత్యుత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. ఇలాంటివారి వల్ల నటులకు చెడ్డపేరు వస్తుంటుంది. అక్కనేని నాగార్జున(Nagarjuna Akkineni) బాడీగార్డు కూడా ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓ పెద్దమనిషిని గట్టిగా తోశాడు. ఫలితంగా నాగ్‌ ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కుబేర అనే సినిమా(Kubera Movie)లో నటిస్తున్నాడు నాగార్జున. ఇందులో భాగంగా హైదరాబాద్‌(Hyderabad) షెడ్యూల్ కోసం నాగార్జునతో పాటు ధనుష్‌(Dhanush) కూడా వచ్చాడు. వీరిద్దరు ఎయిర్‌పోర్టు(Airport)లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడే షాపులో పని చేస్తున్న ఓ పెద్దాయన సెల్ఫీ కోసం నాగార్జున దగ్గరకు వచ్చాడు. ఆ పెద్ద మనిషి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డు గట్టిగా తోశాడు. కిందపడబోయిన ఆ పెద్దమనిషి ఎలాగోలా నిలబడగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నాగార్జున ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని తెలిపాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story