కోలివుడ్‌లో(kollywood) నయనతార(Nayanthara)-ధనుష్‌(dhanush) మధ్య మరింతగా వివాదం ముదిరింది.

కోలివుడ్‌లో(kollywood) నయనతార(Nayanthara)-ధనుష్‌(dhanush) మధ్య మరింతగా వివాదం ముదిరింది. నయనతార డాక్యుమెంటరీ(Nayanthara Documentry) విడుదలతో మొదలైన వివాదం మరో మలుపుతిరిగింది. ఇప్పటికే నయనతార నుంచి రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన ధనుష్‌, మరోసారి కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌పై(Vignesh shivan) పిటిషన్‌ వేశారు.

గతంలో నయతార, ధనుష్‌ జంటగా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌(Nanum rowdy Dhaan) చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుష్‌ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును(Madras high court) ఆశ్రయించింది. పిటిషన్‌ పరిశీలించిన కోర్టు విచారణకు అనుమతించింది. నయనతార నెట్‌ఫ్లిక్స్(Netflix documentry) డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌లోని క్లిప్ వాడడంతో ఈ వివాదం ప్రారంభమైంది. తమ అనుమతి లేకుండా దానిని వాడారని రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్‌ నోటీసులు పంపారు. ఈ మధ్య ఓ పెళ్లిలో కనిపించిన ధనుష్‌, నయనతార ఎడమొహం, పెడమొహంలా ఉన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story