Hero Venkatesh : బెజవాడలో వెంకటేష్ బిజీ బిజీ..
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేశ్(Venkatesh) విజయవాడలో(Vijayawada) బిజీ బిజీగా గడిపారు. బెజవాడ దుర్గమ్మను(Kanka Durga temple) దర్శించుకున్న ఆయన.. ఆ వెంటనే టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్‌కు(Babai Hotel) వెళ్లారు. వెంకిమామ రావడంతో బాబాయ్ హోటల్ సందడిగా మారింది.

Hero Venkatesh
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేశ్(Venkatesh) విజయవాడలో(Vijayawada) బిజీ బిజీగా గడిపారు. బెజవాడ దుర్గమ్మను(Kanka Durga temple) దర్శించుకున్న ఆయన.. ఆ వెంటనే టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్‌కు(Babai Hotel) వెళ్లారు. వెంకిమామ రావడంతో బాబాయ్ హోటల్ సందడిగా మారింది. వెంకటేష్ వచ్చాడని తెలిసి జనాలు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటెత్తారు. ఫొటోలు తీసుకుని మురిసిపోయారు.
ఇక టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు వెంకీ. వెంకటేశ్ నటించిన పాన్ ఇండియా మూవీ సైంధవ్(Saindhav) రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈక్రమంలో మూవీ ప్రమోషన్లతో(Promotions) బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ తో పాటు దర్శకుడు, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ సైథవ టీమ్ అంతా కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజబాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రార్ధించారు.
ఇక దుర్గమ్మ ఆలయానికి వచ్చిన సైంథవ టీమ్ కు ఆలయ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్ వస్తున్న విషయం తెలియడంతో అభిమానులు ఆలయానికి చేరుకుని ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న సైంధవ్ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఇది జనవరి 13న విడుదల కానుంది. సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
