✕
Mirnalini Ravi : మాల్దీవ్స్ బీచ్ లో అందాల ఆరబోత.. బ్యూటీఫుల్ లుక్స్ లో ‘గద్దలకొండ గణేష్’ భామ.. !
By EhatvPublished on 28 Feb 2023 5:18 AM GMT

x
Mirnalini Ravi
-
- మిర్నాలిని రవి ఈ భామ ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతో పేరు సంపాదించొచ్చన్న ఆశకాస్త పెనంమీద నీళ్లు చల్లినట్టే అయింది. అయితే అంతకముందు ఈ భామ తమిళ సినిమా ‘సూపర్ డీలక్స్’ లో గెస్ట్ రోల్ చేసింది.
-
- ఈ భామ హీరోయిన్ గా పరిచయం అవ్వకముందు సోషల్ మీడియాలో డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేస్తుండేది. ఆ వీడియోలు చూసిన డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ రాజా ఆయన సినిమాలో నటించే అవకాశం కల్పించారు.
-
- ఈ ముద్దుగుమ్మ 1995 మే10న పాండిచ్చేరిలో జన్మించారు. బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మిర్నాలిని. IBM సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా పని చేశారు.
-
- ఇక మిర్నాలిని రవి ‘కోబ్రా’, ‘ఎనిమి’, ‘ఛాంపియన్’, ‘ఎంజీఆర్ మాగన్’, ‘జంగో’ వంటి చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘మామా మశ్చింద్రా’ తోపాటు ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లు’ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
-
- ఈ భామ ఫేవరెట్ డబ్ స్మాషెర్ గా 2016లో స్మైల్ సెట్టాయ్ అవార్డు కూడా గెలుచుకుంది. గద్దల కొండ గణేష్ చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్స్ కి నామినేట్ అయింది. ఇక ఎనిమీ చిత్రానికి గానూ ద రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో షి బ్యూటీ అవార్డ్స్ 2022 గెలుచుకుంది.
-
- మిర్నాలిని రవి సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తలోనే ఉంటున్నారు. ఈమె పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. అయితే రీసెంట్ గా ఈ భామ మాల్దీవ్స్ వెళ్లింది. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫొటోలు రిలీజ్ చేసింది.
-
- ఈ ఫొటోలకు అభిమానులు రకరకాలు కమెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికి ఇన్ స్టా గ్రామ్ లో 1.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించింది. ఈమె ఇప్పటి వరకు 371 పోస్టులను షేర్ చేసింది.

Ehatv
Next Story