పది పదిహేనేళ్ల కిందట ఎలక్ట్రానిక్‌ మీడియా(ELectronic media) ఈ స్థాయిలో లేదు

పది పదిహేనేళ్ల కిందట ఎలక్ట్రానిక్‌ మీడియా(ELectronic media) ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు తామరతంపరగా యూ ట్యూబ్‌ ఛానెల్(Youtube Channels)స్‌ వచ్చేశాయి. సెల్‌ఫోన్‌ ఉన్నవారు కూడా రిపోర్టర్లే! అందుకే సెలెబ్రెటీలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అత్యవసర పని మీద బయటకు వస్తే కెమెరాలను పట్టుకుని వెంటపడుతున్నారు. వద్దని చెప్పినా వినడం లేదు. బాలీవుడ్‌ నటి తాప్సీ పన్నుకు(Tapsi pannu) ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. ఇటీవల ఆమె ఓ చోటుకు వెళ్లింది. అంతే అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీయడం మొదలు పెట్టారు. వద్దు అని వారిస్తున్నా వారు మాత్రం వినలేదు. దాంతో తాప్సీకి ఒకానొక టైమ్‌లో అసహనం వచ్చేసింది. ' నేను కేవలం నటిని మాత్రమే. పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు. రెండిటికీ చాలా తేడా ఉంది. కెమెరా పట్టుకుని నాపైకి రావడం,ఫిజికల్‌గా హ్యాండిల్‌ చేయడం చాలా పెద్ద తప్పు. ఎవరైనా వద్దు అని అంటే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పు పట్టవచ్చు.. అలాంటప్పుడు హీరోయిన్‌గా ఎందుకు చేస్తున్నావు అని అడగవచ్చు. కానీ నటన అంటే నాకు ఇష్టం. అది ప్రొఫెషన్‌' అని తాప్సీ వివరంగా చెప్పుకొచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story