తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి తెలియని వారు లేరు

తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి తెలియని వారు లేరు. నిత్యం ఏదో ఒక వార్తల్లో ఉంటూ వివాదం అవుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక సందర్భాన ఆయన సోషల్ మీడియాలో ఉండడం గమనిస్తూనే ఉంటాము.

తాజాగా తనను టీవీ5(TV5) జర్నలిస్ట్(Journalist) మూర్తి బెదిరించాడన్న వీడియో విడుదల చేసారు. అయితే, ఈ గొడవ ముందు ఆయన నాగచైతన్య(Nagachaithanya) - శోభిత ధూళిపాల(Shobitha dhulipala) రిలేషన్ పై చేసిన వివాదాస్పద జోష్యం సంబంధించి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ లో మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో వేణు స్వామికి తెలంగాణ రాష్ట్ర ఉమెన్ కమిషన్(Women commission) సమన్లు జారీ చేసింది. ఈ విషయం సంబంధించి ఆగస్టు 22న ఆయన వ్యక్తిగతంగా కమీషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

మహిళా కమిషన్ సమన్లపై వేణు స్వామి హైకోర్టుకు వెళ్లి మహిళా కమిషన్ ఆదేశాలను నిలిపివేయాలని కోరగా అందుకు హైకోర్టు సమన్లపై స్టే(stay) ఇచ్చింది. దీంతో వేణుస్వామికి ఊరట లభించింది

Updated On
Eha Tv

Eha Tv

Next Story