Pooja Hegde Comments: ఆ స్టార్ హీరో 'ఆ పనిచేస్తే' చెంప పగలగొట్టా: పూజాహెగ్డే వ్యాఖ్యలు వైరల్..!

టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పొడుగుకాళ్ల సుందరి, పూజ హెగ్డే చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అట ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో ఆమెకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వివరించింది. తాను ఈ విషయం బయటపెట్టడంతో చర్చనీయాంశంగా మారింది. కెరీర్ మొదట్లోనే ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఆ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నానని పూజ తెలిపింది. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె చెప్పింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అనుమతి లేకుండానే ఆ సినిమాలో నటించిన స్టార్ హీరో తన క్యారవాన్‌లోకి వచ్చాడని పూజ వెల్లడించింది. అప్పటికే అది తనకు అసౌకర్యంగా అనిపించిందని, ఆ తర్వాత అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో పూర్తిగా షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాకపోయినా, చివరికి సహనం కోల్పోయి అతడి చెంపపై ఫట్ మని కొట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా చేయగానే అతడు క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడని పూజ వివరించింది. ఆ తర్వాత ఆ హీరో తనతో నటించలేదని తెలిపింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా వైరలవుతోంది. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే టీం స్పందించింది. అలా ఎవరితో పూజా హెగ్డే చెప్పలేదని, ఎవరో పుట్టించిన పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది ఆమె టీం.


