Heroine Nidhi Agarwal..! నాకు 14 ఏళ్లకే డ్రింక్ అలవాటు.. ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని: హీరోయిన్ నిధి అగర్వాల్..!

హీరోయిన్లపై సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన విషయాలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్యూలో వెల్లడించింది. తనకు 14 ఏళ్ల వయసులోనే మద్యం అలవాటైందని, అది రానురాను ఎక్కువైందని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్‌గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నా. మద్యం తాగక ఆరేళ్లు అవుతుందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పార్టీలకు వెళ్తున్నా మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. ఆల్కహాల్ లేకున్నా పార్టీలు ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది.


