జై బోలో తెలంగాణ సినిమాలో కథానాయికగా నటించిన మీరా నందన్‌ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. శనివారం ఉదయం గురువాయుర్‌ ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

జై బోలో తెలంగాణ(Jai Bolo Telangana) సినిమాలో కథానాయికగా నటించిన మీరా నందన్‌(Meera Nandan) వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. శనివారం ఉదయం గురువాయుర్‌ ఆలయం(Guruvayur temple)లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మలయాళీ అయిన మీరా నందన్‌ కెరీర్‌ యాంకర్‌గా మొదలయ్యింది. ఆ తర్వాత సింగర్‌ అయ్యింది. 2008లో మీరా నందన్‌కు మొదటి అవకాశం లభించింది. లాల్‌ జోస్‌ దర్శకత్వంలో వచ్చిన ముల్లా సినిమాతో హీరోయిన్‌ అయ్యింది. తర్వాత తమిళ, తెలుగు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో జై బోలో తెలంగాణ, హితుడు, 4th డిగ్రీ వంటి సినిమాలలో నటించింది. జై బోలో తెలంగాణ సినిమా విజయవంతమైనప్పటికీ ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. లాస్టియర్‌ ఎన్నలుమ్ ఎంటే ఆలియా అనే మలయాళ సినిమాలో నటించింది. బహుశా ఇదే ఆమె చివరి చిత్రం కావచ్చు. ప్రస్తుతానికైతే కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదు. బ్రిటన్‌కు చెందిన శ్రీజు అనే చార్టెడ్ అకౌంటెంట్‍‌తో కలిసి మీరా నందన్‌ ఏడు అడుగులు వేసింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలని మీరానే సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది.సింపుల్‌గా గుళ్లో పెళ్లిచేసుకున్న హీరోయిన్‌

Updated On
Eha Tv

Eha Tv

Next Story