బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి కొత్త హంగులతో వస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటున్నారన్నదే ఆసక్తిగా మారింది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 8(Bigg Boss 8) కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి కొత్త హంగులతో వస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటున్నారన్నదే ఆసక్తిగా మారింది. గత ఏడు సీజన్ల కంటే ఈసారి డిఫరెంట్‌గా షో ఉంటుందని నిర్వాహకులు మాట ఇస్తున్నారు. అందుకు తగినట్టుగానే బిగ్‌ బాస్‌ ప్రోమో ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 కొత్త లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా వేగంగానే జరుగుతోంది. అయితే ఈ సారి బిగ్ బాస్‌ హౌస్‌కు పవన్ ఫ్యాన్స్‌(Pawan Fans).. జనసైనికురాలు.. రేఖా భోజ్(Rekha Boj) వెళుతున్నారట! ఇలాగని చెప్పుకుంటున్నారు. రేఖా భోజ్‌ను నిర్వాహకులు సంప్రదించినప్పుడు ఆమె ఓకే అన్నారట! రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ. రెండు మూడు తెలుగు సినిమాల్లో నటించింది కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం రేఖా భోజ్‌ వైజాగ్‌లో ఎక్కువగా ఉంటున్నారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ సోషల్‌ మీడియా(Social Media)లో పాపులరయ్యారు. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో బట్టలిప్పేస్తానని ప్రకటిచింది ఈమెనే! ఈ ప్రకటనతో ఆమె పాపులారిటీ ట్రిపులయ్యింది. అన్నట్టు ఈమె ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)కు వీరాభిమాని. మొన్నటి ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. ఆ విధంగా పవన్‌ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరయ్యింది. మంచి మాటకారి కావడంతోనే బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఈమెను అప్రోచ్‌ అయ్యారట! దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story