పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan)- నేషనల్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) మధ్య వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan)- నేషనల్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun) మధ్య వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. సోషల్‌ మీడియాలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో కొట్టేసుకుంటున్నారు. మొన్నామధ్య అల్లు అర్జున్‌ మామగారు కూడా కల్పించుకుని పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. ఇప్పుడీ వివాదం ఇంకాస్తా ముందుకెళ్లింది. పొలిటికల్‌ కలర్‌ అంటుకుంది. జనసేన(Janasena MLA) ఎమ్మెల్యే ఈ వివాదంపై పెదవి విప్పారు. పైగా అల్లు అర్జున్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నాకు తెలియదే అంటూ భయంకరమైన సెటైర్‌ వేశారు. బహుశా, తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో అంటూ బన్నీ గాలి తీశారు. 'ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా విడిపోయి బ్రాంచీలు పెట్టుకుంటే నేనేం చెప్పలేను. అవన్నీ షామియానా కంపెనీలు. ఉన్నది మెగా ఫ్యాన్స్(Mega Fans) మాత్రమే' అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌(Bolishetty srinivas) కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అల్లు అర్జున్‌ తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని కూడా బొలిశెట్టి అన్నారు.

'బన్నీ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిరంజీవి అభిమానులు, బన్నీలో చిరంజీవిని చూసుకుంటున్నారు. అవన్నీ మరిచిపోయి నాకిష్టమైతేనే వస్తా అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా నిన్ను రమ్మని ఎవరు పిలిచారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పోటీచేసిన ప్రతి చోటా నెగ్గాం. నువ్వెళ్లింది ఒక్క చోటుకి. అక్కడ ఓడిపోయింది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్యే ఇలా మాట్లాడటంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. పవన్‌- బన్నీ మధ్య అంతరం బాగా పెరిగిందనే అనుకోవాలి. ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చుకున్నారు. తనకు నచ్చితే వస్తానని, మనసుకు నచ్చితే వస్తానని చెప్పారు. హీరోను చూసి ఫ్యాన్స్‌ వస్తారని, కానీ తాను మాత్రం ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యానని బన్నీ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు బొలిశెట్టి శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారని అనుకోవాలి. బొలిశెట్టి వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనవేనా? పార్టీ అభిప్రాయమా అన్నది తేలాల్సి ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకే బొలిశెట్టి ఇలా మాట్లాడారా అన్న అనుమానం కూడా కొందరికి కలుగుతోంది. చూద్దాం ఈ వివాదం ఎక్కడికి వరకు వెళుతుందో..!

Updated On
Eha Tv

Eha Tv

Next Story