Pawan kalyan : డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేనాని
తమిళనాడుకు(Tamilnadu) చెందిన వేల్స్ యూనివర్సిటీ(Wells University) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు(Pawan kalyan) డాక్టరేట్(Doctrate) ప్రధానం చేసేందుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఈ నెలలోనే జరుగనున్న యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం కూడా పంపింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు.

Pawan kalyan
తమిళనాడుకు(Tamilnadu) చెందిన వేల్స్ యూనివర్సిటీ(Vels university) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు(Pawan kalyan) డాక్టరేట్(Doctrate) ప్రధానం చేసేందుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఈ నెలలోనే జరుగనున్న యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం కూడా పంపింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ఆయన లేఖ ద్వారా స్పందిస్తూ.. వివిధ రంగాలలో గొప్పగా రాణించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు. వేల్స్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. అలాగే గౌరవంగా భావిస్తున్నాను. కానీ.. నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో సరైన వారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నాను అంటూ లేఖ ద్వారా తెలియజేశారు.
