పోక్సో చట్టం కింద అరెస్ట్‌ అయిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టార్‌కు గట్టి షాకే తగిలింది.

పోక్సో చట్టం కింద అరెస్ట్‌ అయిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టార్‌కు గట్టి షాకే తగిలింది. జాతీయ అవార్డు అందుకోవడం కోసమని మధ్యంతర బెయిల్‌ను పొందిన జానీ మాస్టర్‌కు ఆ కోరిక తీరలేదు. అతడికి ఇచ్చే జాతీయ అవార్డును జాతీయ అవార్డుల కమిటీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు కోరారు. 2022లో తిరుచిత్రబలం చిత్రానికిగాను జాని మాస్టర్‌(Jani Master)కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీ(New Delhi)లో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని సిటీ కోర్టు అంగీకరించి, ఆయనకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Updated On
ehatv

ehatv

Next Story