జుట్టు ఉన్న అమ్మ ఎన్నికొప్పులు పెట్టుకుంటుందనేది పాత సామెత. డబ్బులున్నోడు ఏం చేసినా వార్తే అనేది ఇప్పుడు కొత్త సామెతగా చెప్పాలేమో. డబ్బున్న జనం వెషాలు మామూలుగా ఉండవు మరి. ఓ బలిసిన భర్త తన భార్య నెంబర్-2 వెళ్లేందుకు అరుదైన గిఫ్ట్ అందించాడు. 88 లక్షల విలువైన టాయిలెట్‌ సీట్‌ను(Commode) తన భార్యకు బహుమతి ఇచ్చాడు. అమెరికన్‌ నటి, గాయని, డ్యాన్సర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌కు(Jennifer Lopez) భర్త బెన్‌ అఫ్లెక్‌ బీజ్వెల్డ్(Affleck Bejeweled) ఈ టాయిలెట్‌ కమోడ్‌ను గిఫ్ట్‌గా అందించాడు.

జుట్టు ఉన్న అమ్మ ఎన్నికొప్పులు పెట్టుకుంటుందనేది పాత సామెత. డబ్బులున్నోడు ఏం చేసినా వార్తే అనేది ఇప్పుడు కొత్త సామెతగా చెప్పాలేమో. డబ్బున్న జనం వెషాలు మామూలుగా ఉండవు మరి. ఓ బలిసిన భర్త తన భార్య నెంబర్-2 వెళ్లేందుకు అరుదైన గిఫ్ట్ అందించాడు. 88 లక్షల విలువైన టాయిలెట్‌ సీట్‌ను(Commode) తన భార్యకు బహుమతి ఇచ్చాడు. అమెరికన్‌ నటి, గాయని, డ్యాన్సర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌కు(Jennifer Lopez) భర్త బెన్‌ అఫ్లెక్‌ బీజ్వెల్డ్(Affleck Ben) ఈ టాయిలెట్‌ కమోడ్‌ను గిఫ్ట్‌గా అందించాడు.

జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ ఏడాది కింద పెళ్లి చేసుకున్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి వీరు పెళ్లి చేసుకున్నారు. జెన్నిఫర్ లోపెజ్ 1991లో తొలిసారిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన పాత్రలు, డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలాడిస్తూనే ఉంది. తనకు ఇష్టమైన నటనే కాకుండా.. ఫ్యాషన్‌ రంగంపై కూడా మక్కువ పెంచుకుంది. వివిధ రకాల ఆభరణాల సేకరణకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జే లెనో షోలో ఈ జంట కనిపించింది. బెన్ అఫ్లెక్ తన భార్యకు $105,000 టాయిలెట్ సీటు ఇచ్చాడన్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టాయిలెట్ యొక్క కమోడ్ సీటులో ముత్యాలు, పగడాలు, నీలమణి, వజ్రాలు వంటి ఖరీదైన ఆభరణాలు ఉన్నాయని బెన్‌ అఫ్లెక్ తెలిపాడు. బెన్ అఫ్లెక్ తన ముద్దుల భార్యకు 88 లక్షల విలువైన బెజ్వెల్డ్ టాయిలెట్ సీటును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం తెలిసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఖరీదైన గిఫ్ట్‌తో కొత్తగా ఏంటి ఒరిగేది.. ఆ పనికోసం అంత గిఫ్ట్‌ అవసరమా అని కామెంట్ చేస్తున్నారు.

Updated On 13 Feb 2024 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story