దేవర(Devara) ప్రీ రిలీజ్ వేడుక(Pre-Release Event) రద్దు కావడంతో ఎన్టీఆర్‌(NTR) అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

దేవర(Devara) ప్రీ రిలీజ్ వేడుక(Pre-Release Event) రద్దు కావడంతో ఎన్టీఆర్‌(NTR) అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరేళ్ల తర్వాత తమ అభిమాన నటుడి సినిమా వస్తే ఇలా చేస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు. పాస్‌లు(Pass) ఇవ్వడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన శ్రేయాస్‌ మీడియాపై(Shreyas media) నిప్పులు చెరుగుతున్నారు. కెపాసిటీకి మించి పాస్‌లు ఎందుకు ఇవ్వాలని నిలదీస్తున్నారు ఎన్టీఆర్‌ అభిమానులు. వేల కొద్ది అభిమానులు వస్తారని తెలిసీ ఇన్‌డోర్‌ ఆడిటోరియంలో(In Door Auditorium) ఫంక్షన్‌ పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి వేలాది మంది ఎన్టీఆర్‌ అభిమానులు ఆడిటోరియంలోకి దూసుకురావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హాల్‌ కెపాసిటీకి మించి అభిమానులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. చాలా మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో అభిమానులు నోవాటెల్‌ హోటల్‌లోపల అద్దాలను ధ్వంసం చేశారు. కుర్చీలు విరగగొట్టారు.కేపాసిటీ కి మించి పాస్ లు ఇచ్చిన శ్రేయాస్ మీడియాపై కేసులు నమోదు చేయాలనీ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story