ఎన్టీఆర్‌(NTR)-కొరటాల శివ(Koratala siva) కాంబినేషన్‌లో రూపొందిన దేవర(Devara) సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఎన్టీఆర్‌(NTR)-కొరటాల శివ(Koratala siva) కాంబినేషన్‌లో రూపొందిన దేవర(Devara) సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమా ఎన్టీఆర్‌కే కాదు, కొరటాల శివకు కూడా ఓ పరీక్షలాంటిది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రమోషన్‌ వర్క్‌ బాగానే జరుగుతోంది. నిడివి విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే సెన్సార్‌(Sencor) పూర్తయ్యింది. సినిమా విడుదలకు ముందు టీమ్‌ పునరాలోచనలో పడింది. ఇంత డ్యూరేషన్‌ ఉంటే బాగుండదేమోనని ఏడు నిమిషాల సీన్లను ట్రిమ్‌(scene trim) చేశారు మేకర్స్‌. 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల నిడివితో సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఇందులో ఏడు నిమిషాలను తొలగించారు కాబట్టి 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వీటిలో యాడ్స్ అన్ని తీసేస్తే మూవీ నిడివి సరిగ్గా 2 గంటల 42 నిమిషాలు వస్తుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్(Janhv kapoor) హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్(Saif alikhan) విలన్. అనిరుధ్ సంగీతమందించాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story