యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Pawan kalyan) ఎక్స్‌లో థాంక్స్ చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Pawan kalyan) ఎక్స్‌లో థాంక్స్ చెప్పారు. ఏపీలో దేవర(Devara) టికెట్ ధరలు(Ticket price) పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతినివ్వడం పట్ల సోషల్ ఇండియా వేదికగా మామయ్య చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు. ఈనెల 27 న విడుదల కాబోతున్న దేవర చిత్రానికి తెలంగాణలో(Telangana) ధరలు పెంచుకునేందుకు అనుమతి ఉన్నా ఏపీలో టికెట్ ధరల పెంపు విషయంలో కాస్త స్తబ్దత నెలకొంది. కానీ ఇప్పుడు దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకు పెంచుకునేందుకు అనుమతించారు. అంతేకాకుండా రిలీజ్ రోజున అంటే సెప్టెంబర్ 27 తెల్లవారు జామున 12 గంటల నుంచి మొత్తం 6 షోలకు అనుమతి నిచ్చిన ఏపీ ప్రభుత్వం. 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story