కమల్ హాసన్ తన కొత్త సినిమా థగ్ లైఫ్ ప్రమోషన్ కోసం చెన్నై(Chennai)లో జరిగిన ఒక ఈవెంట్‌లో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కమల్ హాసన్ తన కొత్త సినిమా థగ్ లైఫ్ ప్రమోషన్ కోసం చెన్నై(Chennai)లో జరిగిన ఒక ఈవెంట్‌లో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తన ప్రసంగంలో "ఉయిరే ఉరవే తమిళే" (నా జీవితం, నా కుటుంబం తమిళ భాష) అని చెప్పి, అక్కడ ఉన్న కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌(Shivrajkumar)ను ఉద్దేశించి, "మీ భాష కన్నడ కూడా తమిళం నుంచి పుట్టింది, కాబట్టి మీరు కూడా ఈ లైన్‌లో భాగమే" అని అన్నారు.ఈ వ్యాఖ్యలు కన్నడ భాష స్వతంత్ర చరిత్రను తక్కువ చేస్తున్నాయని.. కర్ణాటకలోని బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప(Vijayendra Yediyurappa) కమల్ వ్యాఖ్యలను సంస్కారహీనమని.. 6.5 కోట్ల కన్నడిగుల స్వాభిమానాన్ని దెబ్బతీసినవని విమర్శించారు. కన్నడ రక్షణ వేదిక వంటి సంస్థలు కమల్ వ్యాఖ్యలను ఖండించాయి. బెంగళూరు(Benguluru)లో థగ్ లైఫ్ పోస్టర్లను చించివేసి, కమల్ సినిమాలను కర్ణాటకలో నిషేధించే హెచ్చరికలు జారీ చేశాయి. చరిత్రకారుడు కాదు అని, భాషల మూలాల గురించి మాట్లాడే అర్హత లేదని విజయేంద్ర అన్నారు. కన్నడ భాషకు 2,500 ఏళ్ల చరిత్ర ఉందని, ఇది స్వతంత్ర గుర్తింపు కలిగిన భాష అని నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో కన్నడిగులు తీవ్రంగా స్పందించారు. కొందరు కన్నడ భాషకు 56 అక్షరాలు ఉండగా, తమిళ భాషకు 26 అక్షరాలే ఉన్నాయని, కన్నడం తమిళం నుంచి పుట్టలేదని వాదించారు. కమల్ హాసన్ ఈ వివాదంపై ఇంకా స్పష్టమైన క్షమాపణ లేదా వివరణ ఇవ్వలేదు. కర్ణాటక(Karnataka)లో థగ్ లైఫ్ సినిమా విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కమల్ హాసన్ (Kamal Haasan)వ్యాఖ్యలు కన్నడ భాష స్వతంత్ర గుర్తింపును కించపరిచేలా ఉన్నాయని కన్నడిగులు భావిస్తున్నారు. ఈ వివాదం రాజకీయ, సామాజిక స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కమల్ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ఆయన సినిమాపై బహిష్కరణ ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story