కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌(Raj kumar) మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌(Raghavendra rajkumar) తనయుడు యువ రాజ్‌కుమార్‌(Yuva Raj kumar) కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు.

కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమార్‌(Raj kumar) మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌(Raghavendra rajkumar) తనయుడు యువ రాజ్‌కుమార్‌(Yuva Raj kumar) కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. యువ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇటీవలే భార్య శ్రీదేవి(Sridevi) అతడికి విడాకులు ఇచ్చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అతడితో ఉండదల్చుకోలేదని చెప్పింది. పైగా కాంతార ఫేమ్‌ సప్తమి గౌడతో(Sapthami gowda) అతడికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. యువ సినిమాలో హీరోయిన్‌గా నటించింది సప్తమి గౌడనే! చాలా ఇంటర్వ్యూలలో శ్రీదేవి తన విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ సప్తమి గౌడ కారణంగానే తనకు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సప్తమి గౌడతో తన భర్త అఫైర్‌ పెట్టుకోవడం వల్లే తమ పెళ్లి పెటాకులైందని అన్నారు. ఇలా శ్రీదేవి తనపై పదే పదే దాడి చేస్తుండటం సప్తమి గౌడకు కోపం తెప్పించింది. తనపై అభాండాలు వేస్తున్నందుకు శ్రీదేవిపై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది సప్తమి గౌడ. తనకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ప్రజల ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story