చాలా ఎదురుచూపుల తర్వాత, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ చివరకు తమ గర్భధారణను ప్రకటించారు!

చాలా ఎదురుచూపుల తర్వాత, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ చివరకు తమ గర్భధారణను ప్రకటించారు! కత్రినా గర్వంగా తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ, ఆ జంట ఇలా పంచుకున్నారు. “ఆనందం మరియు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోని ఉత్తమ అధ్యాయాన్ని ప్రారంభించే మార్గంలో ఉన్నాము'' అని పోస్ట్ చేశారు. చాలా రోజుల నుండి చాలా రూమర్స్ వస్తున్నాయి, ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కత్రీనా బేబీ బంప్‌ని ప్రౌడ్‌గా షో ఆఫ్ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేశారు. వికీ సైడ్‌లో నిలబడి సంతోషంగా చూస్తున్నాడు. ఇద్దరూ 2021లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఇంటిమేట్ వెడ్డింగ్ చేసుకున్నారు. జూలై 30, 2025న ముంబై ఫెర్రీ పోర్ట్ వద్ద వీళ్ళు కలిసి కనిపించినప్పుడు కత్రీనా లూస్ షర్ట్ వేసుకుని, జాగ్రత్తగా నడుస్తూ ఉండటంతో స్పెక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత యాడ్ షూట్ నుండి లీక్ అయిన బేబీ బంప్ ఫోటో వైరల్ అయింది. ఇంతకు ముందు వికీ 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ లాంచ్‌లో రూమర్స్‌ని ఖండించాడు. కానీ ఈరోజు అధికారికంగా ప్రకటించారు
