డబుల్ ఇస్మార్ట్‌ నుంచి మరో పాట..ఆకట్టుకుంటున్న కేసీఆర్‌ వాయిస్‌

రామ్‌ పోతినేని(Ram pothineni) హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్(double ismart) సినిమా కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాకు సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌(Puri jagannath). రామ్‌ సరసన కావ్యా థాపర్‌(Kavya thapar) నటిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ వీడియో పాటను విడుదల చేశారు ఇప్పటికే స్టెప్‌ మార్‌ అనే పాటను రిలీజ్‌ చేసిన మేకర్స్‌ ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఈ పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్‌ అందించాడు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కీర్తన శర్మ ఆలపించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. పాట మధ్యలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) వాయిస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కేసీఆర్‌ వాయిస్‌ డైలాగే ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్‌-రామ్‌ కాంబినేషన్‌లో 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పంద్రాగస్టుకు విడుదల కాబోతున్నది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story