హాలీవుడ్‌ నటి కమ్‌ మోడల్‌ కిమ్‌ కర్దాషియన్‌(Kim Kardashian) తెలియని వారు చాలా తక్కువమందే ఉంటారు. ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఫ్యాషన్‌ విషయంలో కిమ్ కర్దాషియన్ అప్‌డేట్‌గా ఉంటారు. ఈ విషయంలో డబ్బుకు వెనుకాడరు! తనకు నచ్చందంటే చాలు ఎంత మొత్తమైనా పెట్టేందుకు రెడీగా ఉంటారు.

హాలీవుడ్‌ నటి కమ్‌ మోడల్‌ కిమ్‌ కర్దాషియన్‌(Kim Kardashian) తెలియని వారు చాలా తక్కువమందే ఉంటారు. ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఫ్యాషన్‌ విషయంలో కిమ్ కర్దాషియన్ అప్‌డేట్‌గా ఉంటారు. ఈ విషయంలో డబ్బుకు వెనుకాడరు! తనకు నచ్చందంటే చాలు ఎంత మొత్తమైనా పెట్టేందుకు రెడీగా ఉంటారు. అంత్యంత ఖరీదైన వస్తువలను కొనడం ఆమె హాబీ! అందుకే ఆమె డ్రస్సుల దగ్గర్నుంచి మిగతా యాక్ససరీస్‌(Accessories) వరకు చాలా స్పెషల్‌గా ఉంటాయి. రీసెంట్‌గా కిమ్‌ కర్దాషియన్‌ ఓ ఫుట్‌బాల్‌ చూసేందుకు వెళ్లింది. తనతో పాటు ఓ ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లింది. సిల్వర్‌ కలర్‌లో మెరిసిపోతున్న ఈ బ్యాగ్‌పైనే అందరి దృష్టి పడింది.

కిమ్‌ కర్దాషియన్‌ చేతిలో ఉన్నది కాబట్టి ఆ హ్యాండ్‌ బ్యాగ్‌ రేటు ఎక్కువేనని జనం అనుకున్నారు, లక్షో రెండు లక్షలో ఉంటుందని అనుకున్నారే తప్ప దాని అసలు రేటు వారికి తెలియదు.. తెలిస్తే నోరెళ్ల బెడతారు! గుండెలు బాదుకుంటారు.. ఆ హ్యాండ్‌బ్యాగ్‌ రేటు ఎంతనుకుంటున్నారు? అక్షరాల 3 కోట్ల 12 లక్షల 61 వేల రూపాయలు. ఇందులో స్పెల్లింగ్‌ మిస్టేకులేమీ లేవు.. మీరు విన్నది కరెక్టే.. మూడు కోట్లు పెట్టి కొనాల్సినంద స్పెషాలిటీ ఏముంది? అంటారా.. ఈ బ్యాగును హిర్మేస్‌ కంపెనీ తయారు చేసింది.. బంగారం, వజ్రాలతో దీన్ని డిజైన్‌ చేసింది. ప్రపంచంలో చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ బ్యాగు ఉంది. కొందరు కస్టమర్ల కోసం ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాగులు మార్కెట్‌లో అందుబాటులో లేవట! ఉంటే మాత్రం కొనేవారు ఎవరుంటారు?

Updated On 31 July 2023 4:02 AM GMT
Ehatv

Ehatv

Next Story