బాలీవుడ్‌(Bollywood Heroine) హీరోయిన్‌ కృతి సనన్‌(Krithi sanon) తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా సుపరిచితమే!

బాలీవుడ్‌(Bollywood Heroine) హీరోయిన్‌ కృతి సనన్‌(Krithi sanon) తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! ఆమె మహేశ్‌బాబుతో(Mahesh babu) కలిసి నేనొక్కడినే సినిమాలో నటించింది. ప్రభాస్‌(Prabhas) హీరోగా వచ్చిన ఆదిపురుష్‌(adipurush) సినిమాతో మరింత దగ్గరయ్యింది. తాజాగా ఆమె ధనుష్‌తో(Danush) కలిసి ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఆదిపురుష్‌ తర్వాత సౌత్‌ హీరోతో కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్‌, ధనుష్‌ తొలిసారి కలిసి నటిస్తున్నారు. తేరే ఇష్క్‌ మే అనే పేరుతో వస్తున్న ఈ సినిమాకు ఎఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కృతిసనన్‌ సిక్రేట్‌గా తన ప్రియుడితో ఎంగేజ్‌మెట్(Kriti sanon) చేసుకున్నదనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. బాయ్‌ఫ్రెండ్‌ కబీర్ బాహియాతో(Kabir bahiya) గ్రీస్ దేశంలో నిశ్చితార్థం జరిగింది. తన కంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన కబీర్‌ను కృతి పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. అయితే నిశ్చితార్థం విషయం నిజమో కాదో కృతి సననే చెప్పాలి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story