సినీ నటుడు రాజ్‌తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya choudhary) ఎపిసోడ్‌కు ఇప్పట్లో ముగింపు పడేలా లేదు.

సినీ నటుడు రాజ్‌తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya choudhary) ఎపిసోడ్‌కు ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ టెలివిజన్‌ సీరియల్‌లా సాగుతోంది. లేటెస్ట్‌గా రాజ్‌తరుణ్‌ ఫ్రెండ్‌ అయిన ఆర్‌జే శేఖర్‌ బాషా(RJ shekar basha) తనపై దాడి చేశాడంటూ లావణ్య చౌదరి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ చేసింది. లావణ్య తనపై దాడికి ప్రయత్నించిదంటూ శేఖర్‌ బాషా కూడా అదే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహించిన డిబేట్‌కు శేఖర్‌ బాషా హాజరయ్యాడు. ఈ సందర్భంలోనే లావణ్య కూడా ఆ ఛానెల్‌ స్టూడియోకు వెళ్లింది. చర్చా కార్యక్రమం అంతా అయ్యాక బయటకు వచ్చిన శేఖర్‌ బాషా, లావణ్య చౌదరిలు అక్కడ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. తనపై శేఖర్‌బాషా దాడికి పాల్పడ్డాడని, అమానుషంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్‌ పోలీసులకు కంప్లయింట్‌ చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story