హీరో రాజ్‌తరుణ్‌(Raj Tharun)-లావణ్య(Lavanya) వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది.

హీరో రాజ్‌తరుణ్‌(Raj Tharun)-లావణ్య(Lavanya) వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. ఈ కారణంగానే సోషల్‌ మీడియాలో(social media) రోజుకో కథనం వస్తోంది. రాజ్‌తరుణ్‌తో 11ఏళ్లుగా కలిసి ఉన్నానని, తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని, బలవంతంగా అబార్షన్‌(abortion) కూడా చేయించాడని లావణ్య చౌదరి చెబుతూ వచ్చింది కదా! ఇప్పుడు తనను వదిలేసి మాల్వి మల్హోత్రా(Malvi malhotra) అనే హీరోయిన్‌తో తిరుగుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మాల్వి మల్హోత్రా తన సోదరితో కలిసి తనను చంపేస్తానని బెదిరిస్తున్నదని చెప్పింది. మరోవైపు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద కేసులు పెట్టారు. ఇవన్ని ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. మొన్నటి వరకు ఏమైనా కానివ్వండి తనకు రాజ్‌ తరుణ్‌ కావాల్సిందేనని, అతడితోనే ఉంటానని చెప్పుకొచ్చిన లావణ్య ఇప్పుడు మాట మార్చింది. జీవితంలో అతడి మొహం చూడనని అంటోంది. మొన్న తిరగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ సమయంలో లావణ్య చౌదరి వచ్చి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story