హీరో రాజ్‌తరుణ్‌(Raj tharun)-లావణ్య చౌదరి(Lavanya) ఎపిసోడ్‌లో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

హీరో రాజ్‌తరుణ్‌(Raj tharun)-లావణ్య చౌదరి(Lavanya) ఎపిసోడ్‌లో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రాజ్‌తరుణ్‌తో సహజీవనం చేస్తున్న లావణ్య కొన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు. రాజ్‌తరుణ్‌ తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, తాను మట్టుకు అతడిని వదిలే ప్రసక్తే లేదని చెబుతోంది. మాల్వీ మల్హోత్రాతో(Malvi Malhotra) సంబంధం పెట్టుకున్నా సరే, రాజ్‌తరుణ్‌ తనకు కావాల్సిందేనని అంటోంది. మస్తాన్‌తో(Masthan) తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగానే రాజ్‌తరుణ్‌ తనపై నిందలు మోపుతున్నాడని ఆరోపించింది. తనకు రాజ్‌తరుణ్‌ ఓ గుడిలో తాళికట్టాడని, ఇద్దరికి ఆ విధంగా పెళ్లి కూడా జరిగిందని లావణ్య అంటోంది. రాజ్‌తరుణ్‌తో తనకు పెళ్లియిన విషయం సినీ రంగంలో చాలా మందికి తెలుసని, వరుణ్‌సందేశ్‌(Varun sandesh), నిఖిల్(Nikhil), రాజా రవీంద్రలను అడిగితే తమ పెళ్లి విషయం చెబుతారని లావణ్య తెలిపింది. మా పెళ్లి జరిగిన మొదటి వినాయకచవితి రోజున రెండు కుటుంబాల పెద్దలు మమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టి ఆశీర్వదించారని, అలా మా పెళ్లికి తల్లిదండ్రుల నుంచి ఆమోదముద్ర పడిందని తెలిపింది. పెళ్లయిన చాన్నాళ్లకు కానీ రాజ్‌తరుణ్‌ స్వభావం తెలిసిందని, అతడు ఎవరెవరితో కలిసి నటించాడో ఆ హీరోయిన్లందరితోనూ అఫైర్లు పెట్టుకున్నాడని ఆరోపిచింది. యాంకర్‌ అరియానా గ్లోరీతో(Ariana Glory) కూడా సంబంధం ఉందని తెలిపింది. . తాను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లానని, ఆ సమయంలోనే అరియానాకు రాజ్‌తరుణ్‌ దగ్గరయ్యాడని లావణ్య చెప్పింది. ఈ విషయం రాజా రవీంద్ర ఫోన్‌ చేసి చెప్పడంతో తనకు ఈ విషయం తెలిసిందని, లేదంటే తెలిసేది కాదని తెలిపింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story