బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబాయిలోని బాంద్రాలో ఉన్న త‌న నివాసం ఏడో అంత‌స్థు (టెర్రస్‌) నుంచి ఆయ‌న కిందకు దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అనిల్ అరోరా(Anil Arora) ఇవాళ ఉద‌యం ఆత్మ‌హ‌త్య (Suicide)చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మ‌లైకా అరోరా మాజీ భ‌ర్త అర్బాజ్ ఖాన్‌(Arbaj khan), సీనియ‌ర్ పోలీసు అధికారులు అనిల్ అరోరా(Anil arora) ఇంటికి చేరుకున్నారు. అనిల్ అరోరా భౌతిక కాయాన్ని పోస్టుమార్ట‌మ్ కోసం పంపించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు!

Updated On
Eha Tv

Eha Tv

Next Story