మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో, సేలం-బెంగళూరు నేషనల్ హైవేపై పాలకోడ్ (పరైయూర్) సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో, సేలం-బెంగళూరు నేషనల్ హైవేపై పాలకోడ్ (పరైయూర్) సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతని కుటుంబం త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వైద్య పరీక్షల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. షైన్ టామ్ చాకో తండ్రి సి.పి. చాకో (70 ఏళ్లు) అక్కడికక్కడే మరణించారు. షైన్‌కు కుడి చేయి విరిగింది. అతని తల్లి మరియా కార్మెల్ (65), సోదరుడు జో జాన్ చాకో, డ్రైవర్ (ఆనిస్, 42) గాయాలతో బయటపడ్డారు.అందరినీ ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సి.పి. చాకో శవాన్ని పోస్ట్‌మార్టం కోసం అదే ఆసుపత్రికి తరలించారు. పాలకోడ్ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. షైన్ టామ్ చాకో జిగర్తాండా డబుల్‌ఎక్స్, దసరా, బజూకా వంటి తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు. ఈ ఘటన అభిమానులను షాక్‌లో ముంచెత్తింది. సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story