Actress Bhama Divorce : విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. ఇక నా జీవితం కూతురికే అంటూ ఎమోషనల్
సినీ రంగంలో విడాకులు అనేది చాలా సర్వసాధారణమనే విషయం తెల్సిందే. ఈ కాలమే కాదు పాత తరం సినీనటులు పెళ్లిళ్లు చేసుకోవడాలు, విడాకులు తీసుకోవడాలు చాలా కామన్. తాజాగా ఓ హీరోయిన్‌కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. తన భర్తతో విడిపోయినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇకపై తన కూతురే తనకు జీవితమంటూ ఎమోషనల్ పోస్టు చేసింది.
- Written By: Ehatv Published Date - Thu - 9 May 24
సినీ రంగంలో విడాకులు అనేది చాలా సర్వసాధారణమనే విషయం తెల్సిందే. ఈ కాలమే కాదు పాత తరం సినీనటులు పెళ్లిళ్లు చేసుకోవడాలు, విడాకులు తీసుకోవడాలు చాలా కామన్. తాజాగా ఓ హీరోయిన్‌కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. తన భర్తతో విడిపోయినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇకపై తన కూతురే తనకు జీవితమంటూ ఎమోషనల్ పోస్టు చేసింది. మలయాళ హీరోయిన్ ‘భామ'(Bhama) తన భర్త నుంచి విడాకులు(divorce) తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో(social media) పోస్ట్ చేసింది. ‘సింగిల్ మదర్(single mother) అయిన తర్వాత కానీ నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉంటానని నాకే తెలియదు. ఇప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడి ‘నా కూతురుకు నేను.. నాకు నా కూతురు.. ప్రస్తుతానికి ఇదే మా జీవితం’ అంటూ పాపతో ఉన్న ఫొటోను షేర్‌చేసింది. గతంలోనూ వీరిద్దరు విడిపోయినట్లు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ వార్తలను లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా హీరోయిన్ భామనే స్వయంగా ఎక్స్‌లో పోస్టు చేయడంతో వీరి వివాహ బంధానికి తెరపడినట్లయింది.
సినిమాల విషయానికొస్తే ఈ ‘భామ’ నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందచందాలతో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అయితే తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. హీరో తనీష్ నటించిన ‘మంచివాడు’ అనే సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎం్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రానప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో తన నటనతో మెప్పించింది. పెళ్లయిన తర్వాత సినిమాలకు కొంచెం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ వచ్చింది. 2018లో ఖిలాఫత్ అనే మలయాళ సినిమాలో చివరిసారి నటించిందీ భామ. తాజాగా విడాకులపై పోస్ట్ చేయడంతో ధైర్యంగా ఉండాలని.. మీరు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
-
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్
-
Telangana Cabinet Meet : ఈసీ అనుమతి రాకపోవడంతో రద్దైన కేబినెట్ భేటీ
-
Hyderabad : బంగారు ఆభరణాలు మిస్సింగ్.. కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు
-
Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Konaseema : రావులపాలెంలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
-
Andhra Pradesh : కుక్కను కత్తితో పొడిచి చంపిన కసాయి
-
Madhavi Latha : కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ మాధవీ లత