✕
Sanya Malhotra : హిందీ రీమేక్‌లో మలయాళం మూవీ.. షూట్ కంప్లీట్ అంటూ నటి పోస్ట్.. !
By EhatvPublished on 4 March 2023 5:46 AM GMT

x
The Great Indian Kitchen
-
- ఈ సినిమా అంతా కూడా కొత్త పెళ్లికూతురు మీదే నడుస్తుంటుంది. భర్త, అతని కుటుంబ సభ్యులు కోడల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడంతోపాటు, తనకిష్టమైన ప్యాషన్ ను అడ్డుకుంటూ ఉంటారు.
-
- ఇలాంటి సిచ్యువేషన్ లో ఆమె ఏం చేసింది.. ? అనేదాని స్టోరీ నడుస్తుంటుంది. ఇందులో సురాజ్ వెంజరామూడు, నిమిష సాజయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
-
- అయితే ఈ మూవీని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా నటిస్తోంది.
-
- ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిందని ఒక ఫొటోను సాన్యా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టింది. ఈ గ్రూప్ ఫొటోలో హర్మన్ బవేజా, ఆరతి కడవ్ కలిసి ఉన్న ఫొటో షేర్ చేసింది.
-
- ఇక ఈ సినిమాను 2019లో వచ్చిన సైఫై అండ్ డ్రామా ‘కార్గో’ను డైరెక్ట్ చేసిన ఆరతి కడవ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని హర్మన్ బవేజా నిర్మిస్తున్నారు.
-
- సాన్యా మల్హోత్రా ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ చిత్రాల్లో కనిపిస్తుంటుంది. ‘లుడో’, ‘పగ్లాయిట్’, ‘మీనాక్షి సుందరేశ్వర్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సాన్యా మల్హోత్రా కథల్ లో పోలీస్ క్యారెక్టర్ చేసి అందరినీ అలరించింది.

Ehatv
Next Story