లోకనాయకుడు కమలహాసన్‌(Kamal hasan)-స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌(shankar) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భారతీయుడు-2(Indian 2). ఈ మూవీని ఈ నెల 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

లోకనాయకుడు కమలహాసన్‌(Kamal hasan)-స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌(shankar) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భారతీయుడు-2(Indian 2). ఈ మూవీని ఈ నెల 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్‌ రాజేంద్రన్‌(Asan Rajender) అనే వ్యక్తి మదురై కోర్టుకు(Madurai court) వెళ్లాడు. అందుకు కారణమేమిటంటే తన అనుమతి తీసుకోకుండా సినిమాలో మర్మకళ(Marma) టెక్నిక్‌ను ఉపయోగించారట! థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ సినిమాను విడుదల చేయకుండా బ్యాన్‌ చేయాలని కోర్టును రాజేంద్రన్‌ కోరారు. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రాచీన యుద్ధకళ అయిన మర్మకళలో రాజేంద్రన్‌కు పట్టున్న మాట వాస్తవమే! రాజేంద్ర రాసిన పుస్తకాన్ని చూసే శంకర్‌ ప్రేరణ పొందాడట! భారతీయుడు సినిమాలో మర్మకళకు సంబంధించిన పలు సన్నివేశాలు ఉంటాయి. పైగా హీరో కమలహాసన్‌కు మర్మకళపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది కూడా రాజేంద్రనే! ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2 తీశారు. ఇందులో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను వాడారన్నది రాజేంద్రన్‌ ఆరోపణ! మరి కోర్టు ఏమంటుంది? విడుదలకు అనుమతి ఇస్తుందా? లేక విడుదల వాయిదా పడుతుందా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story