మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో నటిస్తున్న అగ్నినక్షత్రం(Agni Nakshatram) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మంచులక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు మోహన్‌బాబు(mohan babu) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనికి మంచి స్పందన లభిస్తోంది.

Agni Nakshatram
మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో నటిస్తున్న అగ్నినక్షత్రం(Agni Nakshatram) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మంచులక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు మోహన్‌బాబు(mohan babu) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మీడియాతో ముచ్చటించారు. పోలీస్ నేపథ్యంలో సాగే చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి(Rohit shetty) అద్భుతంగా తెరకెక్కిస్తారని, ఆయన దర్శకత్వానికి నేను అభిమానినని మంచు లక్ష్మి తెలిపారు. 'అగ్నినక్షత్రంలో నేను పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాను. పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతగానో శ్రమించాను' అని అన్నారు. రోహిత్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకుంటూ తెలుసా తెలుసా ప్రమోషనల్ పాటను సిద్ధం చేశామని, ఇందులో దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన కార్లను ఉపయోగించామని తెలిపారు . మహిళా సాధికారితకు ఈ పాట అద్దం పడుతుంది అని ఆమె చెప్పారు. అగ్నినక్షత్రం సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు, మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
