మంచు బ్రదర్స్(Manchu Brothers) మధ్య గొడవలు రచ్చకెక్కాయి. తర్వాత మోహన్‌బాబు(Mohan Babu) జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగాయి. విష్ణు(Manchu Vishnu) తన మనిషి సారథిని కొడుతున్నాడంటూ మనోజ్(Manchu Manoj) సోషల్ మీడియా(Social Meida)లో ఓ వీడియో షేర్ చేయడంతో గొడవల విషయం బయటపడింది. అబ్బే తమ మధ్య పెద్ద గొడవలేమీ లేవని, సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలే

Manchu Manoj Shares Interesting Post
మంచు బ్రదర్స్(Manchu Brothers) మధ్య గొడవలు రచ్చకెక్కాయి. తర్వాత మోహన్‌బాబు(Mohan Babu) జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగాయి. విష్ణు(Manchu Vishnu) తన మనిషి సారథిని కొడుతున్నాడంటూ మనోజ్(Manchu Manoj) సోషల్ మీడియా(Social Meida)లో ఓ వీడియో షేర్ చేయడంతో గొడవల విషయం బయటపడింది. అబ్బే తమ మధ్య పెద్ద గొడవలేమీ లేవని, సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలేనని విష్ణు చెప్పుకొచ్చారు. అన్నదమ్ములిద్దరూ సహనం పాటించాలని మోహన్‌బాబు తనయులకు హితవు చెప్పారు. వీడియోను డిలీట్ చేయించారు. మొత్తంగా ఇప్పుడు గొడవలేమీ లేవని అనుకున్నాం... కానీ అంత లేదని మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ద్వారా అర్థమవుతోంది.
తాజాగా మనోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసీ చూడనట్లు వదిలేయడం కంటే నిజం కోసం పోరాడి చావడం మంచిది అన్న అర్థం వచ్చే ఓ కొటేషన్‌ను పెట్టాడు. క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అని మరో కోట్‌ను కూడా షేర్ చేశాడు. మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ దండం పెడుతున్న ఎమోజీని క్యాప్షన్‌లో జోడించాడు మనోజ్. ఈ పోస్టులు అర్థమయ్యి కానట్టుగానే ఉన్నప్పటికీ.. మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోంది. మళ్లీ విష్ణు ఏమైనా అన్నాడేమో అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మీ గొడవలు సద్దుమణగాలని కోరుకుంటున్నానని మరొకరు కామెంట్ చేశారు. తమ సపోర్ట్ ఎల్లప్పుడూ నీకే అంటూ ఇంకొకరు చెప్పారు. మరి ఈ పోస్టులైనా ఉంటాయా? లేక డిలీట్ అవుతాయా? వీటికి విష్ణు ఏమైనా కౌంటర్లు ఇస్తాడా? చూడాలి!
