సెలెబ్రిటీల జాతకం చెప్పను

వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. సోషల్ మీడియాలో(Social media) ఆయన గురించే చర్చలు జరుగుతున్నాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ, ఇబ్బందుల్లో ఉన్నవారితో పూజలు చేయిస్తూ పాపులరయ్యారు వేణుస్వామి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌(YS jagan) మళ్లీ గెలుస్తాడని చెప్పిన వేణుస్వామి జోస్యం తలకిందులయ్యింది. దాంతో ఆయన విపరీతమైన ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తాను సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనని అప్పుడు ప్రకటించారు కానీ మొన్ననాగచైతన్య(Naga chaithanya), శోభిత ధూళిపాళ(shobitha dulipala) ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఉండబట్టలేక మళ్లీ సోషల్‌ మీడియాలోకి వచ్చారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ ముహూర్తం అసలు బాగోలేదని, వీరిద్దరి కాపురంలో2027లో కలతలు వచ్చే అవకాశం ఉందని వేణుస్వామి జోస్యం చెప్పారు. ఓ అమ్మాయి కారణంగానే సంసారంలో తగవులు వస్తాయని అన్నారు. అన్ని చెప్పిన ఆయన నాగ చైతన్య, శోభిత కలిసే ఉండాలని, తన జ్యోతిష్యం తప్పు కావాలని చెప్పుకొచ్చారు. దీని తర్వాత వేణుస్వామి మళ్లీ ట్రోల్‌ అయ్యారు. శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటే ఈ అశుభం మాటలేమిటి? అంటూ తిట్టిపోస్తున్నారు. అసలు నిన్నెవడు జాతకం చెప్పమన్నాడు అని ఫైరవుతున్నారు. దాంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్‌ చేశారు. నాగ చైతన్య, శోభిత జాతకం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నారు. 'మూడు రోజుల క్రితం నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జాతకం చెప్పాను. దానిపై ట్రోల్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. గతంలో సమంత- నాగచైతన్య జాతకాన్ని చెప్పాను కాబట్టి.. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పా. నేను ఇచ్చిన మాటపైనే ఉంటాను. సెల‌బ్రిటీల‌ జాత‌కం చెప్పడం మానేశానని చెప్పాను, అదే మాటపై ఉంటున్నా. రాజకీయ విశ్లేషణ కూడా చెయ్యను. ఇప్పుడే మా(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) మాట్లాడారు. ఆయనకు క్లారిటీ ఇచ్చాను. ఇకపై ఎవరి జాతకం చెప్పను అని చెప్పా. నాతో నేరుగా మాట్లాడతా అన్నారు' అని వేణుస్వామి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు.



Updated On
Eha Tv

Eha Tv

Next Story