అప్పుడెప్పుడో రాజ్‌కుమార్‌ హీరోగా వచ్చిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, మిడ్‌ సెవంటీస్‌లో కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్పలాగే మంచు విష్ణు(Manchu vishnu) హీరోగా నటిస్తున్న కన్నప్ప(Kannappa) కూడా డివోషనల్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీతో తీసిన సినిమా!

అప్పుడెప్పుడో రాజ్‌కుమార్‌ హీరోగా వచ్చిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, మిడ్‌ సెవంటీస్‌లో కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్పలాగే మంచు విష్ణు(Manchu vishnu) హీరోగా నటిస్తున్న కన్నప్ప(Kannappa) కూడా డివోషనల్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీతో తీసిన సినిమా! కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్‌(Prabhas), అక్షయ్‌కుమార్‌(akshay kumar), మోహన్‌లాల్‌(Mohan lal), శివరాజ్‌కుమార్‌(shivaraj kumar) వంటి స్టార్‌ హీరోలందరూ ముఖ్య పాత్రలలో నటించారు. కొన్నిరోజుల క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో(cannes film festival) టీజర్ స్క్రీనింగ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్‌ సన్నివేశాలతోనే టీజర్‌(teaser) మొత్తం ఉంది. మనం అనుకున్నట్టుగానే శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్‌ కనిపించాడు. నుదుట అడ్డ నామాలతో ప్రభాస్ కేవలం ఒకే ఒక్కే సెకను కనిపించాడు. ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారో తెలియదు. టీజర్‌ విడుదల వేడుకలో మంచు విష్ణు కన్నప్ప గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీయమని ఆయనకు పరమేశ్వరుడే చెప్పాడట! '2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్న మోహన్‌బాబు పిలిచి.. డైరెక్టర్‌ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏమిటి? అని అడిగారు. శివుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలనే నేను మొత్తం హోమ్ వర్క్ అంతా చేస్తున్నానని అని జవాబిచ్చాను. లాస్టియర్‌ జనవరిలో శివుడు అనుమతి ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఈ సినిమా మీ ముందుకు తేవడానికి శివుడు ఆశీస‍్సులే కారణం' అని మంచు విష్ణు వివరించాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story