సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

Manchu Vishnu has decided not to contest the next ‘MAA’ elections
సినీ నటుడు(Movie Actor), మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడు(MAA President) మంచు విష్ణు(Manchu Visnu) కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 'మా' ఎన్నికల్లో(Maa Elections) పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధ్యక్షుడిగా తన కాల పరిమితి ముగిసేలోగా పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. మంచు విష్ణు ఇచ్చిన హామీల్లో 'మా' బిల్డింగ్(MAA Building) ముఖ్యమైనది. ఇటీవల సినీ నటుడు నరేశ్(Naresh) మాట్లాడుతూ.. 'మా' బిల్డింగ్ గురించి మంచు విష్ణే చెప్పాలని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ (Movie Artist Association President)ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరం ప్రయత్నిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో మంచు విష్ణుకు నరేశ్ మద్దతుగా నిలిచారు.
