మరికొద్ది గంటల్లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సోషల్ మీడియాలో పుష్ప మోత మోగుతోంది.

మరికొద్ది గంటల్లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సోషల్ మీడియాలో పుష్ప మోత మోగుతోంది. మెగా హీరోలు సినిమాపై రియాక్టవ్వడం లేదన్న అల్లు అభిమానులకు సాయి దుర్గ తేజ్‌ ఆనందపరిచాడు. ఎక్స్‌(Twitter)లో పుష్ప గురించి ట్వీట్‌ చేశాడు. పుష్ప 2 విడుదల సందర్భంగా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పుష్ప టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే సెండింగ్ మై హార్ట్‌ఫెల్ట్ విషెస్ టూ అంటూ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar), దేవి శ్రీ ప్రసాద్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న(Rashmika mandanna), రసూల్ పూకుట్టి, మైత్రీ, సుకుమార్ నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్‌ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story