ఈమధ్య పెళ్ళై ఓ ఇంటివాడు అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej). హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వరుణ్.. ఆపరేషన్ వాలెంటేన్(Operation Valentine) మూవీ మీదే ఆదారపట్టాడు. ఇక తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా.. సర్ ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్.

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు జనవరి 19న కావడంతో మెగా ఫ్యాన్స్.. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు అభిమానులు భారీ కట్ అవుట్(Cutouts) ఏర్పాటు చేసి వరుణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలియజేశారు. వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నారు.
ఇక ఈ మూవీ లుక్ లో ఉన్న వరుణ్ తేజ్ కు సబంధించి 126 అడుగుల కట్ అవుట్ ని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కట్ అవుట్ ఫొటోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది ఆపరేషన్ వాలెంటైన్ సినిమా. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇతర దేశంలోకి వెళ్లి అక్కడ ఫైట్ చేసే పోరాట సన్నివేశాలతో థ్రిల్లర్ యాక్షన్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.