ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది. ప్రమోషన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాలను చుట్టేసిన సినిమా బృందం మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెంట్ కాబోతున్నది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) ముఖ్య అతిథిగా రావాలన్నది చిత్ర బృందం కోరిక. చిరంజీవి హాజరైతే మెగా అభిమానులు- అల్లు అభిమానుల మధ్య ఏర్పడిన అగాధం తొలిగిపోతుందని అందరి భావన! అయితే చిరంజీవిని పుష్ప 2 నిర్మాతలు కలిసి చీఫ్ గెస్ట్‌గా రమ్మని రిక్వెస్ట్ చేశారట! దానికి చిరంజీవి మర్యాదపూర్వకంగానే నో చెప్పారని వినికిడి. ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమా విడుదల అవుతుందంటే మెగా అభిమానులకు పూనకం వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పుష్ప 2 సినిమాపై మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మెగా ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటికే అల్లు అరవింద్, బన్నీ వాసు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. మెగా స్టార్ చిరంజీవి మాత్రం అల్లు అర్జున్‌కు బెస్ట్ విషెస్ చెబుతూనే వేడుకకు రాలేనని చెప్పినట్టు సమాచారం!
