మెగాస్టార్ చిరంజీవి ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆయనకు కేన్సర్ వ్యాధి సోకిందట. ఆందోళన పడకండి.. ఆ వ్యాధిని చిరంజీవి ముందుగానే గుర్తించి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడాయన కేన్సర్‌ను జయించారు. తనకు కేన్సర్ వచ్చిందని చెప్పడానికి భయపడటం లేదని చెప్పిన చిరంజీవి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుననారు.

megastar Chiranjeevi effect with Cancer disease
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆయనకు కేన్సర్ (Cancer) వ్యాధి సోకిందట. ఆందోళన పడకండి.. ఆ వ్యాధిని చిరంజీవి ముందుగానే గుర్తించి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడాయన కేన్సర్‌ను జయించారు. తనకు కేన్సర్ వచ్చిందని చెప్పడానికి భయపడటం లేదని చెప్పిన చిరంజీవి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుననారు. ముందుగా గుర్తిస్తే ఇదేమీ పెద్ద జబ్బు కాదని కేన్సర్ బారిన పడిన వారిలో ఆత్మవిశ్వాసం నింపారు చిరంజీవి. రియల్ హీరో అనిపించుకున్నారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
