మెగాస్టార్ చిరంజీవి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. తాను పూర్తి చేయలేనిది తన స్థానంలో పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేస్తున్నాడన్నారు. తన రాజకీయవారసుడు పవనేనని చెప్పకనే చిరంజీవి(Chiranjeevi) చెప్పారు. ఈ మధ్య తాను వాళ్లకు, వీళ్లకు దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల పరంగా తాను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు. తన నటనా సామ్రాజ్యానికి కూడా వారసుడు కావాలని చిరంజీవి కామెంట్స్ చేశారు. తన కొడుకు రాంచరణ్ (Ramcharan)కొడుకును కనాలి అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇల్లంతా మానవరాళ్లతో నిండిపోయిందని.. ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుందని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్‌కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉందని అన్నారు చిరంజీవి. బ్రహ్మానందం సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్న చిరంజీవి ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
