✕
తనకు తెలియకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

x
తనకు తెలియకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ‘OG’ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు జీవోను జరిగిందని.. పక్క రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) ఈ సినిమాకు జీవో ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా ఇచ్చారు అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదని చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు అమలు చేస్తామన్నారు. . అనంతరం సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాగతించారు. అయితే తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత బిజీ కోమటిరెడ్డి ఉన్నాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ehatv
Next Story