మలయాళ నటుడు షైన్‌ టామ్‌(Shine Tom chako) చాకో పెళ్లికి ముందే బ్రేకప్‌(Break up) చెప్పేశాడు.

మలయాళ నటుడు షైన్‌ టామ్‌(Shine Tom chako) చాకో పెళ్లికి ముందే బ్రేకప్‌(Break up) చెప్పేశాడు. దసరా(Dasara) సినిమాలో విలన్‌గా నటించిన 40 ఏళ్ల షైన్‌ టామ్‌ చాకో జనవరిలో తన లవర్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఇప్పుడు బ్రేకప్‌ వార్త చెప్పాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన షైన్‌ టామ్‌ చాకో నమ్మల్‌ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5 సుందరిగళ్, వినోద్ అక్క సూంట, దా తాడియా వంటి సినిమాలలో విలన్‌గా నటించాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో తీవ్రవాదిగా నటించి తమిళ ఇండస్ట్రీకి దగ్గరయ్యాడు. అలా డబుల్ ఎక్స్‌, జిగర్తాండలో కీలక పాత్రలు పోషించాడు. మొత్తంగా సౌత్‌ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షైన్‌ టామ్‌ చాకో తన ఫ్రెండ్‌, మోడల్‌ తనూజాతో జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తానని ఈ మధ్య చెప్పాడు. అయితే సోషల్‌ మీడియాలో తనూజాతో కలిసి ఉన్న ఫోటోలను షైన్‌ టామ్‌ చాకో తొలగించడంతో అనుమానాలు వచ్చాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలిసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సింగిల్‌ అని చెప్పడంతో ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ అయ్యిందని అర్థమయ్యింది. తమ బంధం కలుషితంగా మారిందని చెప్పిన చాకో ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తాను డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, తనకు నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని తెలిపాడు. అయితే ఇతడికి తబితా మాథ్యూస్ అనే యువతితో ఇంతకు ముందే పెళ్లయ్యింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కొంత కాలం కిందట వీరు విడాకులు తీసుకున్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story